శ్రీ పంచముఖ శివుడు
దైవిక వృత్తాంతం
పంచముఖ శివుడి గురించి
పంచముఖుడు అంటె శివుడు. ఆ పంచముఖాలు సృష్టి, పరిక్షణ, లయము, ధ్యానం, అనుగ్రహం అనే ఐదు దైవిక అంశాలను ప్రతిబింబిస్తాయి.
హిందు ధర్మంలో అత్యంత పవిత్రమై మరియు శక్తివంతమైన రూపాలలో ఒకటైన పంచముఖ శివుడి రూపంలో సవ్యోజాతుడు, వామదేవుడు. అఘోరుడు తత్పురుషుడు మరియు. ఈశనుడు అనే ఐదు రూపాలు ఒక్కొక్కటి ఒక్కో విధిని సూచిస్తుంది.
చరాచర ప్రాణకోటి జీవించే భూమితో ముడిపడి సృష్టిని శాసించే సవ్యోజాతుడు (పశ్చిమ ముఖం), ప్రాణాధారమైన. నీటితో ముడిపడి పరిరక్షణను ప్రతిబింబించే వామదేవుడు (ఉత్తర ముఖం), అగ్నికి ప్రతిరూపమై సృష్టిని లయంచేసి పునర్నిర్శించే శక్తి కలిగిన అఘారుడు(దక్షిణ ముఖం), వాయువుకు ప్రతిరూపమై అనుక్షణం ధ్యానంలో జీవకోటిని రక్షించే తత్పురుషుడు (తూర్పు ముఖం), ఆకాశంతో ముడిపడి సమస్త జగత్తుకు మోక్షం ప్రసాదించే ఈశానుడు(ఊర్ధ్వ ముఖం). ఇలా పంచముఖ శివుడు పంచభూతాలను ప్రతిబింబిస్తూ ప్రజలందరిని పరిరక్షిస్తాడు.
ముక్తిధామంలో, ఫిబ్రవరి 25, 2026 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో పంచముఖ శివుడి విగ్రహా ప్రతిష్టాపన వేదమంత్రోచ్ఛరణలు, హోమాలు, అభిషేకాల మధ్య అంగరంగా వైభవంగా నిర్వహించబడింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులు ఆధ్యాత్మిక విముక్తి (మోక్షం) మరియు అంతర్గత పరివర్తన కోసం శ్రీ పంచముఖ శివుడిని ఆరాధిస్తారు. ప్రతికూల శక్తుల నుండి రక్షించి జీవితంలోని కష్టాలను అధిగమించే శక్తి మరియు ధైర్యాన్ని ప్రసాదించమని భక్తులు ఆయనను వేడుకుంటారు. ఆరోగ్యకరమైన మరియు సుఖశాంతులతో కూడిన జీవితం కోసం, ధ్యాన యోగ సాధనలతో లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం కోసం శివారాధన ఎంతో దోహదపడుతుంది.
సోమవారం శివపూజకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఆ రోజున స్వామివారి అనుగ్రహం కోసం పాలు, నీరు మరియు బిల్వ పత్రాలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
సృష్టి, పరిక్షణ, లయము, ధ్యానం, అనుగ్రహం అనే ఐదు దైవిక అంశాలను ప్రతిబింబిస్తుంది.
- విముక్తి
- రక్షణ
- పరివర్తన
- ధ్యానం
- శక్తి
సందర్శన సమాచారం
శివారాధన మరియు అభిషేకానికి సోమవారాలు అత్యంత పవిత్రమైనవి.
ప్రతి పక్షంలో వచ్చే ప్రదోషం (చాంద్రమాన మాసంలోని 13వ రోజు/త్రయోదశి) రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
సంబంధిత పూజలు
- రుద్రాభిషేకం
- బిల్వార్చన
- మహాన్యాస పూజ

తెర వెనుక నేపథ్యం — ప్రతిష్ఠాపన కొరకు సన్నాహాలు
పంచముఖ శివుడి ప్రతిష్టాపన మహోత్సవానికి ముందు జరిగిన పునాది పనులు, నిర్మాణం మరియు ఏర్పాట్లకు సంబంధించిన చిత్రాల సంకలనం.












