🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం ✦ 🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం
దశాబ్దాలుగా ఆలయ అభివృద్ధి
ఈ ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమైన ఘట్టాలను మరియు కాలక్రమాన్ని ఇక్కడ పరిశీలించండి.
✿
1980
ఆలయ ప్రారంభం ముఖ్యమైన మైలురాయి
సాయిబాబా భక్తులైన ఒక చిన్న బృందం హైదరాబాదులోని ఫిలింనగర్ లో ఒక చిన్న ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకున్నారు. భజనలు మరియు ప్రార్థనల కోసం మొదలైన ఈ అపూర్వ కలయిక వేలమంది విశ్వాస దీపికగా ఎదుగుతుందని ఎవరు ఊహించి ఉండరు.
1980 — ఆలయ ప్రారంభం
1990
మొదటి దేవాలయ నిర్మాణం ముఖ్యమైన మైలురాయి
పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా మొదటి దేవాలయ నిర్మాణం జరిగింది. ఏర్పాటైన గర్భాలయంలో క్రమం తప్పకుండా హారతి సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే షిరిడి ద్వారకామాయి నుండి బాబా స్పృశించిన పవిత్రమైన కిటికీలను తీసుకురావడం జరిగింది.
1990 — మొదటి దేవాలయ నిర్మాణం1990 — మొదటి దేవాలయ నిర్మాణం
2000
ఆలయ విస్తరణ ముఖ్యమైన మైలురాయి
ఈ సమయంలో ఆలయ సముదాయం భారీగా విస్తరించబడింది. ఇతర దేవతామూర్తులైన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ క్షిప్ర గణపతి మరియు మాత శ్రీ రాజశ్యామలా దేవి కోసం ప్రత్యేక గర్భాలయాలను నిర్మించి, భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది.
2000 — ఆలయ విస్తరణ2000 — ఆలయ విస్తరణ
2010
శ్రీరామ గర్భాలయ నిర్మాణం
శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుల కోసం ప్రత్యేక గర్భాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ఆదివారం ఆలయంలో 1000 మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
2010 — శ్రీరామ గర్భాలయ నిర్మాణం2010 — శ్రీరామ గర్భాలయ నిర్మాణం
2015
ఆంజనేయ స్వామి సన్నిధి
శ్రీ ఆంజనేయ స్వామి ఒక ప్రత్యేకమైన గర్భాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మన ఆలయంలోని దేవత మూర్తుల ప్రతిష్టాపన సంపూర్ణమైంది.
2015 — ఆంజనేయ స్వామి సన్నిధి
2020
పెరుగుతున్న భక్తజన సమూహం
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఆలయ భక్తజన సమూహం మరింత పటిష్టమైంది. ఆన్‌లైన్ దర్శనం మరియు వర్చువల్ భజన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అనుసంధానించబడి బాబా అనుగ్రహం పొందారు. ఈ ఆలయం ఫిల్మ్ నగర్ ప్రాంత ప్రజలతో పాటు ప్రపంచంలోని ప్రజలందరికీ ఆధ్యాత్మిక కేంద్రంగా తన సేవలను కొనసాగిస్తూనే ఉంటుంది.
2020 — పెరుగుతున్న భక్తజన సమూహం2020 — పెరుగుతున్న భక్తజన సమూహం
ఈరోజు
విశ్వాసానికి ప్రతీక / విశ్వాస దీపిక
శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం విశ్వాసానికి మరియు భక్తికి ప్రతీకగా నిలుస్తూ, ప్రతి నెల వేలాదిమంది భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఆరు పవిత్రమైన దైవ సన్నిధులు, విద్యా హారతులు, ప్రతివారం ప్రత్యేక కార్యక్రమాలు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాయి బాబా బోధనలైన ప్రేమ, విశ్వాసం మరియు సేవలకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
ఈరోజు — విశ్వాసానికి ప్రతీక / విశ్వాస దీపికఈరోజు — విశ్వాసానికి ప్రతీక / విశ్వాస దీపిక
ప్రయాణం కొనసాగుతుంది
✿
భక్తజన సమూహంతో కలిసి ముందుకు నడుస్తున్న ముక్తి ధామం ఆలయంలో కొనసాగుతున్న నిరంతర సేవలు, వసతులు మరియు భక్తి కార్యక్రమాలకు మీ మద్దతును అందించండి.
ఆలయానికి మద్దతు ఇవ్వండి భాగస్వామ్యులు అవ్వండి