🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం ✦ 🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం
శ్రీ షిరిడి సాయి బాబా

దైవిక వృత్తాంతం

శ్రీ షిరిడి సాయిబాబా గురించి

మన ఆలయ ప్రధాన దైవమైన శ్రీ షిరిడి సాయి బాబా శ్రద్ధ మరియు సబూరి అనే అజరామర బోధనలకు ప్రతిరూపం. అతని దివ్య సన్నిధి ఎంతోమంది భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది.

శ్రీ షిరిడి సాయి బాబా ఈ ఆధ్యాత్మికక్షేత్రానికి మూల స్తంభం. 1838లో షిరిడి అనే గ్రామంలో జన్మించిన సాయి బాబా 1918లో మహాసమాధి అయ్యే వరకు అక్కడే గడిపారు.

అతని బోధనలు అన్ని మతపరమైన సరిహద్దులను దాటి సబ్కా మాలిక్ ఏక్ - అందరి దైవం ఒక్కడే అనే సార్వాజనిక సందేశంతో హిందూ, ముస్లింలను ఏకతాటిపైకి తెచ్చాడు. అన్ని మతాలు ఒకే దైవిక సత్యానికి దారితీస్తాయని బోధిస్తూ ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవ ను ఆచరించమని తన భక్తులను ప్రోత్సహించాడు.

ఈ గర్భగుడిలోని కిటికీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి సాయిబాబా నడియాడిన షిరిడి నుండి తీసుకరాబడ్డాయి. ఈ కిటికిలుసంబంధ సాయి బాబా తను నివసిస్తూ భక్తులను దీవించిన అసలైన ద్వారకామయితో దైవిక సంబంధం కలిగి ఉన్నాయి. ఈ అద్భుతమైన సేకరణ మన ఆలయానికి సంబంధించిన అనేక దైవికమైన కథలలో ఒకటిగా కీర్తించబడుతుంది.

సాయిబాబా ప్రధాన బోధనలైన శ్రద్ధ మరియు సబూరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన లక్షలాదిమంది భక్తులను ముందుకు నడిపిస్తున్నాయి. "మీరు నా వైపు చూస్తే, నేను మీ వైపు చూస్తాను. మీ భారాన్ని నాపై వేస్తే, నేను దానిని మోస్తాను." అని తన భక్తులకు అండగా నిలిచిన మహనీయుడు సాయిబాబా.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ఆధ్యాత్మిక పురోగతికి మూల స్తంభాలైన శ్రద్ధ మరియు సబూరిని బోదిస్తారు.

  • విశ్వాసం
  • ఓర్పు
  • అనుగ్రహం
  • మార్గనిర్దేశం
  • గురు

సందర్శన సమాచారం

గురువారం రోజు దర్శన వేళలు పొడిగించబడతాయి మరియు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ప్రధాన గర్భాలయం హారతి కార్యకలాపాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది.

ప్రత్యేక కథనం

షిరిడి నుండి సేకరించిన పవిత్రమైన కిటికీలు

ఈ పవిత్రమైన కిటికీలు సాయిబాబా నివసించిన అసలైన ప్రాంతం నుండి తీసుకు రావడం చేత ఈ ప్రధాన గర్భాలయం షిరిడితో సజీవ ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి ఉంది.

→ పూర్తి కథనం: షిరిడి నుండి సేకరించిన పవిత్రమైన కిటికీలు

ప్రధాన బోధనలు

శ్రద్ధ (విశ్వాసం): భక్తి మరియు చిత్తశుద్ధితో దైవనుగ్రహంపై నమ్మకం ఉంచడం.

సబూరి (ఓర్పు): ప్రశాంతత, వినయం మరియు క్రమశిక్షణతో కూడిన ప్రార్థనతో పట్టుదలను కలిగి ఉండటం.

ఐక్యత: సబ్కా మాలిక్ ఏక్ అని సూత్రం ఆలయ స్ఫూర్తిని సేవా తత్వాన్ని తెలియపరుస్తుంది.

నేనిక్కడ ఉండగా మీకు భయమెందుకు.....
— శ్రీ షిరిడి సాయి బాబా

సంబంధిత పూజలు

  • రుద్రాభిషేకం
  • అష్టోత్తర అర్చన
  • కాకడ హారతి
  • ధూప హారతి

→ అన్ని సేవలను చూడండి

ముఖ్యమైన పండుగలు

  • సాయిబాబా పుణ్యతిథి
  • గురు పూర్ణిమ
  • శ్రీ రామ నవమి

→ దర్శనం & పండుగల క్యాలెండర్

శ్రీ షిరిడి సాయి బాబా గ్యాలరీ
గర్భాలయం వద్ద తీసిన చిత్రాలను చూడండి
✿
శ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబాశ్రీ షిరిడి సాయి బాబా
అన్ని ఫోటోలు చూడండి
ఆలయాన్ని సందర్శించి వివిధ దేవతల దర్శన భాగ్యాన్ని పొందండి
దర్శనాన్ని ప్లాన్ చేయండి దర్శన వేళలు