🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం ✦ 🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం
శ్రీ క్షిప్ర గణపతి

దైవిక వృత్తాంతం

ఆరంభాలకు అధిపతి, విజ్ఞాలను తొలగించే శ్రీ క్షిప్ర గణపతి ఆలయ ప్రవేశం దగ్గర భక్తులకు దర్శనమిస్తాడు.

శ్రీ క్షిప్ర గణపతి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రవేశ ద్వారం దగ్గర స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తాడు. క్షిప్ర అంటె తొందరగా లేదా శీఘ్రంగా అని అర్థం. ఈ రూపాన్ని దర్శించిన భక్తులను భగవంతుడు వెంటనే అనుగ్రహిస్తాడు.

ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు లేదా ఇతర దేవతలకు పూజను ప్రారంభించే ముందు సాంప్రాదాయబద్ధంగా గణపతిని పూజించడం ఆనవాయితీ. అలాగే ఈ ఆలయ ప్రవేశం దగ్గర భక్తులు క్షిప్ర గణపతి ఆశీస్సులుతో విఘ్నాలను తొలగించుకొని ప్రధాన దైవ దర్శనానికి ముందుకు సాగుతారు.

క్షిప్ర గణపతి తన నాలుగు చేతులలో విరిగిన దంతం (త్యాగానికి చిహ్నం), అంకుశం (అడ్డంకులను తొలిగించడానికి), పాశం (భక్తులను ఆశీర్వదించడానికి), కల్పవృక్షం (కోరికలు తీర్చే చెట్టు) కలిగి ఉంటాడు.

జీవితం, విద్య, వృత్తిలో అడ్డంకులను తొలగాలని, కొత్త ప్రయత్నాలు ప్రారంభాలలో విజయం సిధ్ధించాలని, విజ్ఞానం వరించి ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి భక్తులు శ్రీ క్షిప్ర గణపతిని పూజిస్తారు.

వినాయక చవితి ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ. పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో విభిన్న రకాల అలంకరణలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించబడును.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

భక్తుల జీవితాల్లో విఘ్నాలను తొలిగించి వెంటనే అనుగ్రహించే దైవం.

  • ప్రారంభాలు
  • విఘ్నాలు
  • విజయం
  • విజ్ఞానం

సందర్శన సమాచారం

చాలామంది భక్తులు ప్రధాన దైవాన్ని దర్శించే ముందు ఇక్కడ తమ మొక్కలను చెల్లించుకుంటారు.

సంబంధిత పూజలు

  • గణపతి అభిషేకం
  • మోదక సమర్పణ

→ అన్ని సేవలను చూడండి

ముఖ్యమైన పండుగలు

  • వినాయక చవితి
  • సంకష్టహర చతుర్థి

→ దర్శనం & పండుగ క్యాలెండర్

శ్రీ క్షిప్ర గణపతి గ్యాలరీ
✿
శ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతిశ్రీ క్షిప్ర గణపతి
క్షిప్ర గణపతి స్వామి ఆశీర్వాదం పొందండి
ఆలయాన్ని సందర్శించి వివిధ దేవతల దర్శన భాగ్యాన్ని పొందండి
దర్శనాన్ని ప్లాన్ చేయండి దర్శన వేళలు