🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం ✦ 🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం
శ్రీ దత్తాత్రేయ స్వామి

దైవిక వృత్తాంతం

శ్రీ దత్తాత్రేయ స్వామి గురించి

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామి సృష్టి, స్థితి, లయలకు ప్రతిరూపంగా నిలుస్తాడు.

త్రిమూర్తులైన బ్రహ్మ (సృష్టి కర్త), విష్ణువు (రక్షకుడు) మరియు శివుడు (లయకారుడు) యెక్క మహావతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రవేశానికి ముందే ఉన్న సన్నిధిలో భక్తులకు దర్శనమిస్తాడు.

మన పవిత్ర గ్రంధాల ప్రకారం శ్రీ దత్తాత్రేయుడు అత్రి మహర్షి - అనసూయ దేవి దంపతులకు జన్మించాడు. విశ్వానికి దైవిక జ్ఞానాన్ని అందించడానికి మరియు ఆధ్యాత్మిక దారిని చూపడానికి త్రిమూర్తులే దత్తాత్రేయుడిగా అవతరించారని మన గ్రంథాలు చెబుతున్నాయి.

దత్తాత్రేయుడు దైవత్వంలోని మూడు (సృష్టి, స్థితి, లయలకు) అంశాలకు ప్రతీకగా మూడు తలలు కలిగి ఉంటాడు. నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు కుక్కలతో పాటు భూమాతకు ప్రతీకగా ఒక ఆవు తన వెంట ఉంటాయి.

ఆది గురువుగా పిలవబడే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆయన బోధనలో అన్ని మతపరమైన మార్గాల్లో అంతర్లీనంగా ఉన్న ఏకత్వం, నిజమైన గురువును అన్వేషించడానికి గల ఆవశ్యకత, ప్రకృతి మరియు సృష్టిలోని ప్రతి అంశం నుండి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం, అహంకారం మరియు భౌతిక బంధాలను అధిగమించడం ఇలాంటి ఎన్నో విషయాలు మరియు ఎన్నో ఆధ్యాత్మిక అంశాల గురించి చెప్పబడ్డాయి.

ఆధ్యాత్మిక మార్గనిర్దేశం మరియు జ్ఞానోదయం, మనిషి తన నిజమైన మార్గాన్ని తెలుసుకోవడంలో మార్గనిర్దేశకత్వం, ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు సర్వతోముఖ శ్రేయస్సు కొరకు భక్తులు దత్తాత్రేయ స్వామిని కొలుస్తారు.

భక్తులు దత్తాత్రేయ జయంతిని ప్రత్యేక పూజలు మరియు దత్తాత్రేయ స్తోత్ర పారాయణంతో జరుపుకుంటారు. గురువారం దత్తాత్రేయ స్వామి పూజకు పరమ పవిత్రంగా భావిస్తారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

త్రిమూర్తుల ఐక్యతను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక మార్గ నిర్దేశకత్వాన్ని ప్రసాదిస్తుంది.

  • గురు
  • ఆధ్యాత్మిక మార్గనిర్దేశం
  • త్రిమూర్తులు
  • సంరక్షణ

సందర్శన సమాచారం

దత్తాత్రేయ పూజకు మరియు గురు సంప్రదాయాలకు గురువారం అత్యంత పవిత్రమైనది.

సంబంధిత పూజలు

  • దత్తాత్రేయ అభిషేకం
  • గురుపాదుక పూజ

→ అన్ని సేవలను చూడండి

ముఖ్యమైన పండుగలు

  • దత్తాత్రేయ జయంతి
  • గురు పూర్ణిమ

→ దర్శనం మరియు పండుగల క్యాలెండర్

శ్రీ దత్తాత్రేయ స్వామి గ్యాలరీ
గర్భాలయం వద్ద తీసిన చిత్రాలను చూడండి
✿
శ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామిశ్రీ దత్తాత్రేయ స్వామి
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం పొందండి
ఆలయాన్ని సందర్శించి వివిధ దేవతల దర్శన భాగ్యాన్ని పొందండి
దర్శనాన్ని ప్లాన్ చేయండి దర్శన వేళలు